డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు

పేదప్రజల గుండెచప్పుడు డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ తండ్రిలక్షణాలు పుణికిపుచ్చుకున్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పేదప్రజల గుండెచప్పుడై నిర్వహిస్తున్నపలుసేవా కార్యక్రమాలు :

పెన్షన్లు:

మిత్రుడు వేమయ్య మరియు సోదరుడు అచ్యుతరావుతో కలిసి గత రెండున్నర సంవత్సరములుగా 30 నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 1000/- చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.

ఉచిత వైద్య శిబిరములు–ఉచితశస్త్రచికిత్సలు :

"ఆరోగ్యమే మహాభాగ్యము"అన్న సూత్రాన్ని గుర్తించిన డాక్టరుగారు 2008 నుండి 2016 వరకు ఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపీణీ చేశారు.

ఉద్యోగమేళాలు:

పలు ఉద్యోగమేళాల ద్వారా నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకింగ్ మరియు సివిల్స్ ప్రవేశ పరీక్షల కొరకు కోచింగ్ ఇప్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

సంఘ సేవ:

కుల సంఘాలలో మరియు బలహీన వర్గాలలో ఐకమత్యం సాధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలు పర్యటించి సంఘీయులను విశేషంగా చైతన్య పరిచారు.

లలిత కళలలో ఉచిత శిక్షణ:

తన చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం వారిది. కుల మతాలు, ఆర్ధిక స్తోమతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లలిత కళలలో, POPA ద్వారా, ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.జిల్లా స్థాయి ఉద్యోగస్తులు కూడా తమ పిల్లలను ఈ శిక్షణా తరగతులకు పంపిస్తున్నారంటే శిక్షణా ప్రమాణాల స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు.

తోటి మానవులకు సేవ చేయటమే తన జీవన విధానంగా చేసుకున్న డాక్టర్ గారు అన్ని వర్గాల వారికి ఆత్మబంధువు అయ్యారు. సేవలతో సమాజ నిర్మాణానికి నడుంకట్టి ముందడుగు వేస్తున్న డా. సంజీవ్ కుమార్ గారు ఆదర్శనీయులు.