డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు

• శింగరి శ్రీరంగం గారి కుటుంబములో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు డాక్టర్లే. విద్య ప్రాధాన్యతను గుర్తించి వారిని చదివించిన ఘనత అంతా వారి అమ్మానాన్నలదే. పిల్లలు అందరూ ప్రభుత్వ కాలేజీలలో MBBS సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు కోడళ్ళు అల్లుళ్ళు కూడా డాక్టర్లే. మనవళ్ళు మానవరాండ్లు కూడా డాక్టర్లే. ఆంతా కలిపి ఒకే కుటుంబములో 21 మంది డాక్టర్లు. వారిది ఓ పెద్ద డాక్టర్ల కుటుంబంగా ప్రసిద్ధికెక్కింది. ఇది బహుశా ఆంధ్ర ప్రదేశ్ వైద్య రంగంలోనే ఒక అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వీరిలో అత్యధికులు బంగారు పథకాలు సాధించినవారు కావడము మరొక విశేషం.

వివాహం:

సంజీవ్ కుమార్ గారు 4-3-1992 తేదీన డాక్టర్ వసుంధర గారిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆయుష్మాన్ హాస్పిటల్నందు స్త్రీ వ్యాధి నిపుణులుగా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. కుమార్తె కుమారి డాక్టర్ సౌమ్య కూడా తండ్రి బాట లోనే పయనించి మొదటి ప్రయత్నంలోనే కర్నూలు మెడికల్ కాలేజీనందు MBBS సీటు సాధించికోర్స్ పూర్తి చేశారు. ఇద్దరు కుమారులు అక్షయ్, అభిరామ్ 9,8 తరగతులు చదువుతున్నారు.