మన కర్నూలు. మన వాగ్దానం.

YSRCP MANIFESTO FOR KURNOOL PARLIAMENT SEGMENT:


కర్నూలు జిల్లాకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక గర్వించ దగిన స్థానం ఉంది. బలమైన సంస్కృతి, సాటిలేని సహజ వనరులు మరియు మానవ వనరులు కలవు. 1953 అక్టోబర్ 1 న మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము 31-10-1956 తేదీ వరకు కొనసాగింది. తెలంగాణా లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రములో విలీనమై 1-11-1956 న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. 8-6-2014 రోజున ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణాను విభజించి ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని అమరావతి. దేశములో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఒక్కప్పుడు రతనాల సీమగా వెలుగొందిన రాయలసీమలో ప్రస్తుతము ఏ ప్రాంతానికి వెళ్లినా రాళ్ళ సీమగానే ప్రత్యక్షమవుతుంది. రాష్ట్రములోని 13 జిల్లాలలో కర్నూలు జిల్లా జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో 12 వ స్థానములో ఉన్నదంటే మన అభివృద్ధి ఏమిటో అవగతమవుతున్నది. 1-10-1953 నుండి 2019 వరకు, అంటే గత 66 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురయ్యింది.
ఈ 66 సంవత్సరాలలో 43 సంవత్సరాలు కాంగ్రెస్ వారు మరియు 21.5 సంవత్సరాలు తెలుగు దేశము పార్టీ వారు పరిపాలించారు. 1.5 సంవత్సరం రాష్త్రపతి పాలన విధించ బడినది. మహానేత YS రాజశేఖర్ రెడ్డి గారి 5.3 సంవత్సరాల పరిపాలన మినహాయించి కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. 24 సార్లు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 18 మంది ముఖ్య మంత్రులు సేవలందించారు. వారిలో 6 మంది రాయలసీమ వారు. 66 సంవత్సరాల కాలములో 24.9 సంవత్సరాలు వీరు పరిపాలించారు. కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఉన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య గారు 790 రోజులు మరియు శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు 111+794 = 905 రోజులు, వెరసి 4.6 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్నా కర్నూలు జిల్లాలో, మరీ ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో వలసలు ఆగలేదు. ఆత్మహత్యలు ఆగలేదు .
దీనికి ప్రధాన కారణాలు :
i) జిల్లాలో పరిశ్రమలు లేక పోవటం,
ii) వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఉన్నా ప్రతి ఏటా వచ్చే ప్రక్రుతి వైపరీత్యాలు,
iii) జిల్లాలో అపారమైన సహజ సంపద ఉన్నా తగిన ప్రణాళికలు లేకపోవడం,
iv) జిల్లాలో తుంగభద్ర, కృష్ణ, హంద్రీ, వేదవతి, కుందూ నదులతో పాటు అనేక వాగులు ప్రవహిస్తున్నా కరువు నివారించే ప్రాజెక్టులు, రేజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు దశాబ్దాలుగా వాగ్దానాలకే పరిమితం కావడం,
v) రుణ మాఫీలు ఉత్తుత్తి మాఫీలుగా మిగిలి పోవడం.

దీని పర్యవసానం :
i) 7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు బీడు భూములు అయ్యాయి,
ii) రైతుల, చేనేతల ఆత్మహత్యలు పెరిగాయి, మరియు
iii) వలస కూలీలను తయారు చేసే కర్మాగారం అయ్యింది కర్నూలు జిల్లా.
ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కర్నూలు పార్లమెంటు ప్రాంతములో సగటు గృహ పరిమాణము (average house hold size : 4 కు బదులుగా 5), జనన శాతము (birth రేట్ : 17.4 కు బదులుగా 18.5) మరియు మరణ శాతము (death రేట్ : 7.3 కు బదులుగా 7.9) ఎక్కువ. యువ జనాభా ఎక్కువ, వృద్ధ జనాభా తక్కువ. దీనికి కారణం ఏమిటి ? : రోగాల వలన మరియు దారిద్య్రం వలన పెద్దలు త్వరగా కాలమైపోతున్నారు. దశాబ్దాలుగా పదవులు అనుభవించిన వారు దీని గురించి ఎందుకు మాట్లాడరు ? చరిత్రను తెలుసుకోవడం వలన మనకు రెండు ఉపయోగాలు ఉంటాయి :
i) తప్పుల నుండి నేర్చుకోవడం,
ii) మంచి సాంప్రదాయాలను కొనసాగించడం. పై సూచికలు మన భయంకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ పరిస్థితి నుండి మనలని మనం కాపాడుకోవాలి. సమాజములో మార్పు రావాలి. దీనికి ఒక్కటే మార్గం : నిర్లక్ష్యముతో వ్యవహరించే నాయకులు పోవాలి, నిజాయతీ నిబద్దత కలిగిన నాయకత్వం రావాలి. ప్రతి మానవుడికి ఒక లక్ష్యం ఉండాలి. దానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. అలాగే సమాజములో మార్పు తేవాలి అంటే మనం సమస్యల గురించి అధ్యయనం చేసి, వాటి పరిష్కారము కోసం ఒక లక్ష్యాన్ని, ఒక ప్రణాలికను నిర్దేశించుకోవాలి. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 23 మండలాలు పర్యటించి సమస్యల గురించి తెలుసుకున్నాము. విస్తృత అధ్యయనములో మేము గుర్తించిన సమస్యలు - వాటికి మేము ప్రతిపాదిస్తున్న పరిష్కార మార్గాలు మీముందు ఉంచుతున్నాము. మమ్ములను చట్ట సభలకు ఎన్ను కొని సమస్యలను పరిష్కరించే అవకాశము ఇవ్వ వలసినదిగా ప్రార్దిస్తున్నాము
కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గములోని ప్రధాన సమస్యలు - వాటిని పరిష్కరించేందుకు మా వాగ్దానాలు :
1. విద్యారంగం : విద్యావంతుడైన మనిషి జీవితములో సరైన నిర్ణయాలు తీసుకోగలడు. దేశ సామాజిక మరియు ఆర్ధిక అభివృద్ధిలో విద్యా రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కర్నూలు జిల్లాలోని 2972 ప్రభుత్వ పాఠశాలలో 4.4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1121 ప్రైవేట్ పాఠశాలలో 2.3 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. అంటే 65% మంది ప్రజలు ప్రభుత్వ పాఠశాలలనే నమ్ము కున్నారు. ఉపాధ్యాయుల కొరత మరియు మౌలిక వసతుల లేమితో జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేశారు. జిల్లాలో ఉన్న 188 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో 30 హాస్టళ్లను మూసి వేశారు. ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారింది. అత్యధికం ప్రైవేట్ పరమయ్యింది. ప్రభుత్వ నిర్లక్ష్యము వలన కర్నూలు వైద్య కళాశాల వెలవెలబోతోంది; కాలేజీ ప్రారంభించి 60 సంవత్సరాలు దాటినా అన్ని విభాగాలలో సూపర్ స్పెషలిటీ కోర్సులు లేవు. ప్రభుత్వ రంగములో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు. ఒక్క ప్రభుత్వ వ్యవసాయ కాలేజీ మాత్రమే ఉన్నది. పశు వైద్య కళాశాల లేదు. తగినన్ని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు లేవు. IIIT వంటి ప్రతిష్టాత్మక సంస్థలు లేవు. రాష్ట్ర విద్యా రంగములో కర్నూలు జిల్లా చివరి స్థానములో ఉండటం మరియు రాష్ట్ర అక్షరాస్యతలో కోసిగి మండలం చివరి స్థానంలో ఉండటం దురదృష్టకరం. గత 66 సంవత్సరాలు పదవులు అనుభవించిన నాయకులే దీనికి సమాధానం చెప్పాలి. మా వాగ్దానం :
i. రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా ప్రతి మండల కేంద్రం లో ప్రభుత్వ ఇంటర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాము. ప్రతి నియోజకవర్గ కేంద్రములో పిజి సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తాము. రాయలసీమ యూనివర్సిటీకి అధికంగా నిధులు కేటాయించి అదనపు కోర్సులను ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తాము.
ii. వెటర్నరీ యూనివర్సిటీ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాము.
iii. పత్తికొండలో IT , పాలిటెక్నిక్ కళాశాలల కొరకు ఎదురు చూస్తున్న ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తాం.
iv. కర్నూలు నగరంలోని KVR కళాశాలలో తరగతి గదుల కొరకు మరియు హాస్టల్ వసతి కొరకు అదనపు భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తాం.
v. సర్వ శిక్ష అభియాన్ పథకాల పర్యవేక్షణ కొరకు శాశ్వత ఉద్యోగులను నియమించేందుకు కృషి చేస్తాం.
vi. కర్నూలు ఐటీ కాలేజీలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం.


2. వైద్య రంగం : జిల్లాలో 87 PHC లు, 18 క్లస్టర్ ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారము ప్రతి 5 వేల జనాభాకు ఒక ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్, ఒక మేల్ హెల్త్ అసిస్టెంట్ ఉండాలి, కానీ ఇప్పుడు ఒక్కొక్క హెల్త్ అసిస్టెంటు 10 నుండి 25 వేల జనాభాకు సేవలందిస్తున్నారు. సగం PHC లకు రెగ్యులర్ డాక్టర్లు లేరు, మందులు పరికరాలు తగినన్ని లేవు. దీని మూలంగా సకాలములో వైద్య సేవలు అందక గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అకాల మరణాలు పెరిగిపోతున్నాయి. మనకు డాక్టర్ల కొరత లేదు, కానీ వారికి తగినంత పారితోషకం ఇచ్చి వారి సేవలను వినియోగించుకునే ఉపాయము నిబద్దత ప్రభుత్వము దగ్గర లేదు. ప్రపంచములో అత్యధిక నైపుణ్యము గల డాక్టర్లు మన వారే; వారి సేవలను వినియోగించి ప్రజారోగ్యం మెరుగు పరచుకోవాలి. ఏ సమాజమైన అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యాంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతములో ప్రజలు సాధారణ రోగాలకు తమ సంపాదనలో 8-10% వెచ్చిస్తున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే 60% సంపాదనను వెచ్చిస్తున్నారు. అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చుకోవడానికి తమ పిల్లలను చదువులు మాన్పించి పనులకు పంపిస్తున్నారు. తద్వారా సమాజములో ఆరోగ్యము, అక్షరాస్యత క్షీణిస్తున్నాయి. ఇంట్లో రోగం వలన పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. చదువు లేక పొతే పేదరికం వెంట పడుతుంది. పేదరికం వలన సరైన ఆహారము తీసుకోలేక రోగాల బారిన పడుతున్నారు అమాయక ప్రజలు. ఇది సమాజానికి ఒక విషయం వలయం. దీని ఛేదించడానికి నిజాయతీ, నిబద్దత కలిగిన నాయకులు ఈ సమాజానికి అవసరం. మా వాగ్దానం :

i. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి NIMS తరహాలో అభివృద్ధి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటాము. కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధి కొరకు మేము చేయ తలచిన పనులు :
• బహుళ అంతస్తు భవనాలు నిర్మించి వార్డుల ప్రకననే పరీక్షా కేంద్రాలు నిర్మిస్తాం.
• సూపెర్స్పెషలిటీ కోర్సులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తాం.
• కాన్సర్ విభాగాన్ని త్వరగా ఆధునీకరించేందుకు కృషి చేస్తాం.
• ప్రస్తుతం ఉన్న 1050 పడకల సామర్త్యాన్ని 1550 కు పెంచేందుకు కృషి చేస్తాం.
• కాలిన రోగుల విభాగాన్ని సత్వరమే విస్తరించేందుకు కృషి చేస్తాం.
• కాషువాలిటీ విభాగాన్ని విస్తృత పరుస్తాం.
• ప్రత్యేక ఓపీ భవనాన్ని నిర్మిస్తాం. సిబ్బంది కొరతను తీరుస్తాం.
• ట్రామా కేర్ సెంటర్ కొరకు తగినన్ని నిధులు మరియు సిబ్బందిని సమకూరుస్తాం.
• డాక్టర్లు మరియు నర్సుల నైపుణ్య అభివృద్ధి కొరకు స్కిల్ ల్యాబ్ ను స్థాపిస్తాం.
• గ్రంధాలయమును ఆధునీకరిస్తాం.
• విద్యార్థుల వసతి గృహాలను ఆధునీకరిస్తాం .
• కృత్రిమ అవయవాల తయారీ కేంద్రానికి పూర్వ వైభవం తీసుకొస్తాం.
ii. ప్రతి PHC లో నలుగురు డాక్టర్లను (ఒక ఆపరేషన్లు చేయగల డాక్టరు, ఒక మత్తు డాక్టరు, ఒక స్త్రీ వ్యాధి నిపుణులు, ఒక MBBS డాక్టర్) మరియు నలుగురు స్టాఫ్ నర్సులను నియమించి అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చేందుకు కృషి చేస్తాం.
iii. ప్రతి డివిజన్ కేంద్రములో 100 పడకల ఆసుపత్రి మరియు ప్రతి మండల కేంద్రములో 30 పడకల ఆస్పత్రులు నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాము.
iv. ఎమర్జెన్సీ వైద్య సేవలను అందించేందుకు మరియు గ్రామీణ వైద్యం మెరుగు పరిచేందుకు 108, 104 వాహనాలను ఆధునీకరిస్తాం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం.
3. వ్యవసాయ రంగం : కర్నూలు జిల్లాలో 26 రకాల పంటలను పండించ గల సారవంతమైన భూములున్నాయి. కర్నూలు పార్లమెంటు నియోజక వర్గములో ఎక్కువ శాతం వర్షాధారమే. సాగునీటి సౌకర్యాలు ఉన్నా ప్రాజెక్టులు హామీల గానే మిగిలి పోయాయి. లక్షల సంఖ్యలో వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్తున్నారు. కరువు నష్టపరిహారం ఇవ్వడం లేదు. లక్షకు గాను 40 వేల మంది కౌలు రైతులకే గుర్తింపు కార్డులు ఇచ్చారు. బ్యాంకుల నుండి అప్పులు పుట్టక, ప్రైవేట్ రుణాల వడ్డీలు పెరిగి పోతున్నాయి. రుణ మాఫీలు ఉత్తుత్తి మాఫీలుగా మిగిలి పోతున్నాయి. సమాజానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటిస్తున్నాడు. దిక్కు తోచని బక్క చిక్కిన రైతన్న ఆత్మ హత్య చేసు కుంటున్నాడు. అప్పుల దిగులు వలన వచ్చే గుండె పోటుతో ఎంతో మంది చనిపోతున్నా ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోవడం లేదు. నిస్చేస్టులైన నాయకులను చూసి సమాజము సిగ్గు పడుతుంది. మనస్సున్న నాయకుల కోసం ఎదురు చూస్తుంది మా వాగ్దానం :
i. వైస్సార్ రైతు భరోసా ద్వారా ఒక రైతుకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయల వరకు లబ్ది చేకూరుతుంది.
ii. హాలహర్వి మండలములో పంటలను నాశనం చేస్తున్న " జింకల సమస్య " పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
iii. కోసిగి మార్కెట్ యార్డ్ లో వ్యాపారము మెరుగు పరిచేందుకు కృషి చేస్తాం.
iv. పత్తికొండలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కొరకు కృషి చేస్తాం.4. సాగు నీరు : కర్నూలు జిల్లాలో రైతుల ఆత్మహత్యలు తగ్గాలంటే సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. తుంగభద్ర, కృష్ణ, హంద్రీ, వేదవతి, కుందూ నదులు మరియు అనేక వాగులు మన జిల్లాలో ప్రవహిస్తున్నా మనకెందుకు ఈ పరిస్థితి? గత 66 సంవత్సరాలలో ప్రాజెక్టులు, రేజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మించుకోలేక పోయాము? నాయకుల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం. ఈ క్రింద కనపరచిన ప్రాజెక్టులు మనము నిర్మించుకో గలిగితే శాశ్వతంగా కరువును నివారించ వచ్చు. మా వాగ్దానం :
i. తుంగభద్ర దిగువ కాలువ (LLC): ఆదోని ఎమ్మిగనూరు కోడుమూరు పత్తికొండ మండలాల్లో 74 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంది. ఖరీఫు, రబీకి కలిపి 1.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. కానీ 30-50 వేల ఎకరాలకు మాత్రమే నీరిస్తున్నారు. దీనికి కారణం ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో నీటి చౌర్యం. ఇది నాయకుల నిర్లక్ష్యం మరియు ప్రభుత్వ వైఫల్యం. తుంగభద్ర LLC ద్వారా మనకు రావాల్సిన నీటి వాటాను అండర్ గ్రౌండ్ కాలువ ద్వారా తీసుకొచ్చేందుకు కృషి చేస్తాము.
ii. కర్నూలు కడప కాలువ (KC కెనాల్) : 130 సంవత్సరాల పురాతన మైన ఈ భారీ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాలోని సుంకేసులలో మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 1.73 లక్షల ఎకరాలు మరియు కడప జిల్లాలో 92 వేల ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా రూప కల్పనా చేశారు. నికర జలాలను అనంతపురంకు తరలించడం వలన మరియు తుంగభద్ర డ్యాం పూడిక వలన 50 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. KC కెనాల్ ను ఆధునీకరించేందుకు కృషి చేస్తాం.
iii. తుంగభద్ర ఎగువ కాలువ : ఆలూరు బ్రాంచి, గుంతకల్లు బ్రాంచీ కాలువల క్రింద ఆలూరు నియోజక వర్గములో 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలి. నామ మాత్రంగానే విడుదల చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
iv. హంద్రీ నీవా సృజల శ్రవంతి (HNSS) : నందికొట్కూరు మాల్యాలలో ప్రారంభమై నందికొట్కూరు, కర్నూలు, కల్లూరు, కోడుమూరు, డోన్, పత్తికొండ మరియు దేవనకొండ నియోజక వర్గాలలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించబడింది. నాణ్యత లేక కట్టలు తెగి నష్టము జరుగుతున్నది. పత్తికొండ, దేవనకొండ, ఆలూరు ప్రాంతాలకు లిఫ్ట్ ద్వారా చెరువులు కాలువలు నిర్మించి కరువు నుండి ఈ ప్రాంతాలను కాపాడ వచ్చు. HNSS సామర్థ్యం 40 నుండి 70 టీఎంసీ లకు పెంచి నాలుగు జిల్లాలకు సాగు నీరు అందించ వచ్చు. హంద్రీనీవా, గాలేరు-నగరి కాలువ మొదటి ప్రాధాన్యతగా స్వీకరించి పూర్తి చేసేందుకు కృషి చేస్తాము.
v. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ (GRP) : తుంగభద్ర వరద నుండి లభించే 5.4 TMC ల నీటితో తుంగభద్ర నది నుండి ఎత్తిపోతల ద్వారా దాదాపు 50 వేల ఎకరాలకు నీరు అందించుటకు అనుమతి మంజూరయ్యింది. పులికనుమ, పులకుర్తి ఎత్తిపోతల పథకాలు మంజూరైనా నిధులు లేక ఆగిపోయాయి. వీటిని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
vi. వేదవతి రిజర్వాయిర్ (హగరి లిఫ్ట్ ఇరిగేషన్) : వేదవతి నది కర్ణాటకలో పుట్టి హాలహర్వి దగ్గర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి, 30 KM ప్రవహించి, తిరిగి కర్ణాటకలోకి ప్రవేశించి తుంగభద్ర నదిలో కలుస్తుంది. ఆంధ్ర, కర్ణాటక 5.4 TMC ల నీరు వాడుకోగా మిగిలిన 39 TMCల నీరు తుంగభద్రలో కలుస్తుంది. మనము 13 TMC ల నీరును లిఫ్ట్ ద్వారా తీసుకొని ఆలూరుకి అందించ వచ్చు. హాలహర్వి, మొలగవల్లి వద్ద 4 TMC ల సామర్థ్యముతో రిజర్వాయిర్ నిర్మించి 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించ వచ్చు. సత్వరమే ఈ పనులు చేసేందుకు కృషి చేస్తాం.
vii. గుండ్రేవుల రిజర్వాయిర్ : తుంగభద్ర రిజర్వాయిర్ కు పై భాగాన తుంగభద్ర పై గుండ్రేవుల గ్రామం వద్ద 39TMC ల సామర్థ్యముతో రిజర్వాయిర్ నిర్మించుకోగలిగితే KC కెనాల్ ఆయకట్టుకు మరియు గాజులదిన్నె ఆయకట్టుకు నీరు అందించే అవకాశము ఉంది.
viii. లద్దగిరి హంద్రీ రిజర్వాయిర్ : 2 TMC ల సామర్థ్యముతో లద్దగిరి హంద్రీ రిజర్వాయిర్ నిర్మిస్తే కోడుమూరు మండల గ్రామాలకు నీరు అందించ వచ్చు. నాగలాపురం వద్ద చంద్రావతి తిప్పా రిజర్వాయిర్ కు HNSS నుండి నీటిని మళ్లించి సాగు నీరు అందిస్తాం.
ix. రాయలసీమ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి : పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నాట్లు రాయలసీమ ప్రాజెక్టులను కూడా జాతీయ ప్రాజెక్టులుగా గుర్తిస్తే పశ్చిమ కర్నూలుకు కరువు నుండి విముక్తి కల్పించ వచ్చు.
x. వివిధ మండలాల్లో సాగు నీటి సమస్యలను ఈ విధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం :
• హాంద్రీ, పాలహాంద్రీ, వేదవతి, కుందూ నదులపై రిజర్వాయర్ల నిర్మాణము పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము.
• బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ప్రకారం 4 టిఎంసిల నీటిని వినియోగించుకొనుటకు ఆర్డీఎస్ వద్ద సమాంతర కాలువను నిర్మించుటకు అన్ని విధాలా కృషి చేస్తాము.
• హొళగుంద మండలములోని హెబ్బటం చెరువుకు పడిన గండి సంపూర్ణ మరమ్మత్తు చేయించుటకు కృషి చేస్తాము. హొళగుంద మండలం కడలేమాగి దగ్గర నిర్మించిన సమ్మర్ స్టోరేజి ట్యాంకు లింక్ లైన్లు నిర్మాణము చేసేందుకు కృషి చేస్తాము.
• హాలహర్వి మండలం చింతకుంట జలాశయం పూడిక పూడిక తీసి, పైపు లైన్లను మార్పించేందుకు కృషి చేస్తాము. హాలహర్వి మండలం బిలేహాల్ , కామినహాళ్ చెరువులకు నీళ్లు తెచ్చేందుకు కృషి చేస్తాము. హాలహర్వి మండలం, చింతకుంట వద్ద, కట్ర వంక లిఫ్ట్ ను పునరుద్ధరిస్తాము.
• చిప్పగిరి నగరడోణ బ్యాలెన్సెఇంగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. హంద్రీ నీవా కాలువకు గుంతకల్లు దగ్గర తూము ఏర్పాటు చేసి ఏబీసీ కి నీళ్లు మళ్లించేందుకు కృషి చేస్తాం.
• మంత్రాలయం మండలములో RDS కుడికాలువ ద్వారా నీటి సరఫరా మరియు మెలిగనూరు రిసర్వాయిర్ నిర్మించేందుకు కృషి చేస్తాం.
• పులికనుమ రిజర్వాయర్ నుండి కోసిగి గ్రామానికి నీరు ఇప్పించేందుకు కృషి చేస్తాం.
• కౌతాళం మండలంలో తోవి, వల్లూరు, పొదలకుంట మరియు గుడికంబళి చెరువు ఎత్తిపోతల పథకాల రూపకల్పనకు కృషి చేస్తాం.
• పత్తికొండ మండలములో ని పత్తికొండ చెరువు మరియు పందికొన రిజర్వాయిర్ కు నీళ్లు తెచ్చేందుకు మరియు పందికొన రిజర్వాయిర్ క్రింద ఉన్న తూము పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. పత్తికొండ మండలములో HNSS క్రింద ఉన్న పొలాలకు పంట కాలువలు నిర్మించేందుకు కృషి చేస్తాం.
• తుగ్గలి మండలం జొన్నగిరి చెరువు ఆధునీకరిస్తాం.
• వెల్దుర్తి మండలములోని 18 చెరువులను నింపేందుకు కృషి చేస్తాం. HNSS ప్రాజెక్ట్ నుండి ఉలిందకొండ రిజర్వాయిర్ కు నీటిని మళ్లించి వెల్దుర్తి మండల గ్రామాలలోని నీటి ఎద్దడిని నివారిస్తాం.
• కోడుమూరు మండలం సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు పులికనుమ ప్రాజెక్టు నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల, పులకుర్తి ఎత్తిపోతల పథకం మరియు గుండ్రేవుల ప్రాజెక్ట్ లను సత్వరం పూర్తి చేసేందుకు కృషి చేస్తాము. గూడూరు, సి.బెళగల్, మండలాలల్లో కోట్లు వెచ్చంచినా పనిచేయని ఎత్తిపోత్తల పథకాలపై పూర్తిగా విచారణ చేపట్టి.. ఆయుకట్టు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. సి.బెళగల్ చెరువును నింపి సాగునీటిని అందిస్తాం. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ నిర్మించి 23వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తాం.
• వరదలకు దెబ్బతిన్న సుంకేసుల రిజర్వాయర్ కు శాశ్వత మరమత్తుల చేసేందుకు కృషి చేస్తాం.
5. యువజన మరియు ఉపాధి రంగం : ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో యువ జనాభా అధికం. నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉంది. దేశ భవిష్యత్తు యువత పై ఆధార పడింది. వారు స్వశక్తితో జీవించే అవకాశాలు కల్పించాలి. కర్నూలు జిల్లాలో IT పరిశ్రమను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్న భావన యువకులలో బలంగా ఉంది. ఇది అసంతృప్తి జ్వాలగా మారకుండా ఉండాలి. దీనికి IT పరిశ్రమ మాత్రమే శరణ్యం. కర్నూలులో IT పరిశ్రమను అభివృద్ధి చేయుటకు గల అనుకూల అంశాలు :
• అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది : శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి సైబరాబాదుకు వెళ్ళటం కన్నా కర్నూలుకు రావడం సులభం.
• చిన్న పాటి ఎయిర్పోర్ట్ కర్నూలు నగరములో ఉన్నది.
• హైదేరాబద్ బెంగళూరు హైవే కర్నూలు నడిబొడ్డున ఉన్నది.
• హైద్రాబాదుకు చిన్న కంపెనీలు రాలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పరిపూర్ణ స్థితి (సాచురేషన్) వచ్చినది. భూముల ధరలు పెరిగి పోయాయి. అందువల్ల చిన్న కంపెనీలను వరంగల్ మరియు కరీంనగర్ వైపు మళ్లించేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నం కర్నూలు కోసం మనం చేయ వచ్చును.
మా వాగ్దానం :
i. కర్నూలులో ఐటీ హబ్ ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు కృషి చేస్తాము.
ii. అన్ని నియోగకవర్గాల కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సహిస్తాము.
iii. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్టడీ సర్కిల్స్ మరియు ప్లేసెమెంట్ సెల్స్ పెట్టి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాము వెల్దుర్తి లో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తాం.
iv. కర్నూలులో విద్యార్దినులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం ఉపాధి శిక్షణ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.
v. కర్నూలు నగర శివార్లలో ఉన్న నవోదయ వికలాంగుల శిక్షణ భవనం ఆధునీకరిస్తాం.
vi. నిరుద్యోగ భృతి, వడ్డీ లేని రుణాల వంటి ప్రోత్సాహకాలు ఇప్పించేందుకు కృషి చేస్తాము.

6. చేనేత రంగం : చేనేత కార్మికులు జిల్లాలో 15 వేల మందికి పైగా ఉన్నారు. ఇంటిల్లిపాది కష్టపడితే వచ్చేది రోజుకు 200 రూపాయలు, అంటే ఒక మనిషికి రోజుకు 50 నుండి 60 రూపాయలు. చేనేత రుణ మాఫీ పూర్తిగా చేయలేదు. అప్పులు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మా వాగ్దానం :
i. ఆదోని, ఎమ్మిగనూరులలో టెక్సటైల్స్ పార్కులను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తాము.
ii. చేనేత కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వ పరంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను పకడ్బందిగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.

7. పారిశ్రామిక రంగం : కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అన్ని వనరులు వున్నాయి. జిల్లాలో 37 భారీ-మధ్య తరహా పరిశ్రమలు, 1800 చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఆదోనిలో జిన్నింగు - ప్రెస్సింగ్, ఆయిల్ మిల్లులు, రైసు మిల్లులు 150కి పైగా వున్నాయి. కర్నూల్ నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేటులో చిన్న పరిశ్రమలు ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు వున్నాయి. పాలకుల చిత్తశుద్ధి లోపించటం వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా వున్న పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. భారీ పరిశ్రమల్లో స్థానికులకు నామమాత్రంగానే ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అనేక పరిశ్రమలు మూతపడి దాదాపు 20 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. గాలికి వదిలేసిన పరిశ్రమ రంగాన్ని పునరుద్దరించ వలసి ఉన్నది.
మా వాగ్దానం :
i. జిల్లాలో ప్రభుత్వరంగంలో ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు తెచ్చేందుకు కృషి చేస్తాము.
ii. పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తాం.
iii. మూతపడిన పరిశ్రమలు తెరిపించేందుకు కృషి చేస్తాం
iv. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పన్ను రాయితీలు సాధించేందుకు కృషి చేస్తాం.

8. ఖనిజ వనరులు : ఖనిజ వనరులు అపారం - అభివృద్ధి శూన్యం : జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉంది. లైమ్ స్టోన్, డోలమైట్, గ్రానైట్, ఐరన్ఓర్, బైరటీస్, సున్నపురాయి నిలువలు అపారంగా వున్నాయి. సిలికాన్, నాపరాయి, రంగురాళ్లు మొదలగు అనేక ఖనిజాలున్నాయి. వీటి ఆధారంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి చూపించవచ్చు. వీటిని సాధించాలంటే చిత్తశుద్ధి గల నాయకత్వం అవసరం.
మా వాగ్దానం :
i. బనవాసి విత్తన కేంద్రముగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.
ii. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ సంపద ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తాం

9. శ్రామిక వర్గం :
పరిశ్రమలు మూత పడటంతో అసంఘటిత రంగం మీద 2.5 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఐసిడిఎస్ పరిధిలో అంగన్ వాడీలు, వైద్య, ఆరోగ్య పరిధిలో ఎన్ఆర్హెచ్ఎం, సర్వశిక్షా అభియాన్, ఎస్ఎస్ఏ, మధ్యాహ్న భోజన పథకం, సాక్షర భారత్, తదితర పథకాలలో 22 వేలకు పైగా కార్మికులు అతి తక్కువ వేతనంతో వెట్టిచాకిరికి గురవుతున్నారు. నీరు - మీరు, నీరు - చెట్టు పేరుతో యంత్రాలతో ఉపాధి నిధులు కాజేస్తున్నారు. మా వాగ్దానం :
i. ప్రతి కులానికి కార్పొరేషను ప్రకటించిన జన నేత జగన్నన్నకు శతకోటి వందనాలు. కార్పొరేషన్ల ద్వారా ప్రతి కుల వృత్తిలో ఉన్న సమస్యలను పరిష్కరించ వచ్చును.
ii. ఉపాధి పథకంలో సంవత్సరానికి 200 రోజులు పని కల్పిస్తు, రూ. 250/లు కూలి ఇప్పించేందుకు ప్రయత్నిస్తాము.
iii. అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.
iv. మంత్రాలయం నియోజక వర్గ కేంద్రములో అగ్ని మాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి దుకాణ యజమానులలో మనోధైర్యాన్ని కలిగించేందుకు కృషి చేస్తాం.
v. వరదల ధాటికి దెబ్బ తిన్న నగలదిన్నె గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
vi. కర్నూలులో బి.సీ భవన్, కాపు భవన్ లు నిర్మించేందుకు కృషి చేస్తాం.


10. సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రంగం : ప్రజలు మానసిక రుగ్మతలు లేకుండా ఉల్లాసంగా జీవించాలంటే సాంస్కృతిక రంగం అభివృద్ధి చెందాలి. జిల్లాలో జానపద, పౌరాణిక, సాంఘిక, రంగస్థల కళాకారులు, శాస్త్రీయ నృత్య బృందాలు, సంగీత కళాకారులు, ఆర్కెస్ట్రా బృందాలు, బుర్ర కథ, హార్మోనియం, తబలా కళాకారులు , కవులు, కథా రచయితలు,నవల గేయ రచయితలు, సాహితీవేత్తలు ఉన్నారు. వీరితో పాటు నందికోల, పగటి వేషాలు, తోలుబామ్మలాటలు, గంగిరెద్దులు, గురవయ్యలు, కోలాటం, చెక్కభజన, బీరప్ప డోళ్లు, బ్యాండు మేళాలు, డ్రమ్స్ కళాకారులు ఉన్నారు. జిల్లాలో కళాకారులు చాల దుర్భరమైన పరిస్థితులని ఎదుర్కుంటున్నారు.
మా వాగ్దానం :
i. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలా తోడ్పాటు ఇస్తాం.
ii. జిల్లా కేంద్రంలో ఒక సాంస్కృతిక అకాడమిని ఏర్పాటు ఇస్తాం.
iii. రవీంద్ర భారతి తరహాలో ఆడిటోరియం నిర్మిస్తాం.
iv. సంగీత కళాశాలకు స్వంత భవనాలు ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలి.
v. కౌతాళం మండలంలోని ఉరుకుంద పుణ్యశేత్రంలో భక్తులకు సౌకర్యాలు ఆధునీకరిస్తాం.
vi. వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం వద్ద క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండ చర్యలు చేపడతాం .

11. మహిళా సాధికారత : కర్నూలు జిల్లా లో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళా అక్షరాస్యత 49.8%. స్లమ్స్ లో నివసిస్తున్న మహిళలు మరియు గ్రామీణప్రాంత మహిళలు పౌష్టికాహార లోపం వలన రక్తహీనతతో బాధ పడుతున్నారు. వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి దారులు, చిన్న పరిశ్రమల్లో శ్రామిక మహిళలు, సేల్స్ గర్ల్స్, భవన నిర్మాణ కార్మికులు చాలీ చాలని వేతనాలతో జీవిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు నిధులు మంజూరు కావడం లేదు. మహిళల పై అత్యాచారాలు, వరకట్న వేధింపులు , కుటుంబ హింస ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి . జిల్లాలో బ్రూణ హత్యలు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో 55, 945 గ్రూపులు ఉన్నాయి . 6,71,000 మంది సభ్యులున్నారు . రుణమాఫీ కింద 5 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేశారు. రుణ మాఫీ ఉత్తుత్తి మాఫీ అయింది. దీపం పధకం అమలు కావడం లేదు. అభయ హస్తానికి వేయి రూపాయలు ఇవ్వడం లేదు . డ్వాక్రా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వ మద్యం పాలసీ వల్ల మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నిడివిజన్లలో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. మా వాగ్దానం : వైస్సార్సీపీ నవరత్నాలతో ( వైస్సార్ ఆసరా, వైస్సార్ చేయూత, అమ్మ ఒడి, మద్యపాన నిషేధం, పింఛన్లు మరియు పేదలకు ఇల్లు) మహిళల సాధికారత సాధ్యమువుతుంది.
12. SC, ST, మైనారిటీ సంక్షేమం :
i. SC సంక్షేమం : కర్నూల్ జిల్లాలో SC ల జనాభా 7.5 లక్షలు. సమాజములో టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ SC సోదరుల సామజిక పరిస్థితులు మారలేదు. ఒక సర్వే ప్రకారం ఇప్పటికీ SC లు 72 రకాలుగా కుల వివక్షకు గురౌతూనే ఉన్నారు.
ii. ST సంక్షేమం : మన జిల్లాలో 72 వేల మంది STలు ఉన్నారు. అనాదిగా అడవి బిడ్డలుగా జీవిస్తున్న గిరిజనులకు అడవిలో జీవించడానికి ఆంక్షలు విధిస్తున్నారు . ఫారెస్ట్ అధికారులు అడవి జంతువులకు ఇచ్చే ప్రాధాన్యత గిరిజనులకు ఇవ్వడం లేదు. సొంత భూములు లేవు . గిరిజనులకు రక్షిత మంచి నీటి సౌకర్యం అందని ద్రాక్ష లాగా తయారయినది . దోమల వలన వివిధ రకాల వ్యాధులకు గురి అవుతున్నారు .
iii. ముస్లిం మైనారిటీల సంక్షేమం : కర్నూలు జిల్లాలో ముస్లింలు 6.7 లక్షలు ఉన్నారు . వీరిలో అత్యధికులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అత్యంత దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నయి.
iv. క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం : క్రైస్తవులు జిల్లాలో 45,201 మంది ( 1.07 శాతం ) ఉన్నారు. క్రైస్తవ మిషినరీలు, విద్య సంస్థలు, వైద్య సంస్థల ఆస్తులు కబ్జాకు గురి అయినవి. క్రైస్తవ ఆస్తులను కబ్జా నుండి విముక్తి కలిగించాలి.

మా వాగ్దానం :
i. ఎమ్మిగనూరు ,కర్నూలులో లెథర్ పార్కులను ఏర్పాటు చేయించుటకు ప్రయత్నమూ చేస్తాము. ప్రభుత్వ కార్యాలయాలలో SC లకే ఇవ్వాల్సిన 1.7 వేల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. మూడు ఎకరాల భూమి, ఉచిత గృహాలు, అటవీ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయటం వంటి ప్రోత్సాహకాలు ఇస్తాం.
ii. దేవస్థానాలలో స్థానిక గిరిజనులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తాం. సబ్ ప్లాన్ లో కేటాయించిన నిధులను దారి మళ్లించకుండా గిరిజనులకు మౌలిక వసతులు కల్పిస్తాం. గిరిజన,బాల,బాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేస్తాం. గిరిజన గూడెం,సుగాలి తండాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించి వైద్య సౌకర్యం కల్పించాలి.
iii. వక్ఫ్ చట్టాన్ని అమలు చేసి కబ్జా దారుల పై కఠిన చెర్యలు తీసుకుంటాం. వక్ఫ్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా కృషి చేస్తాం. ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పి ముస్లిం విద్యార్థులకు మండలాల వారీగా స్కూల్స్, రెసిడెన్సియల్ కాలేజీలు, వృత్తి కళాశాలలు ఏర్పాటు చేస్తాం. బాలికలకు వేరుగా ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.

13. త్రాగు నీటి సమస్య : కర్నూలు జిల్లాలో ప్రతి ఏడాది తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. జిల్లాలో మొత్తం 1500 గ్రామీణ ఆవాసాలు ఉన్నాయి. ఇందులో 900 ఆవాసాల్లో తాగునీటి సమస్య ఉంటుంది. వేసవి వచ్చిందంటే ప్రజలు త్రాగునీటి కోసం ఆకాశగంగ వైపు ఎదురు చుడాల్సిన పరిస్థితి ఉంది. శుభ్రమైన త్రాగు నీరు లేకపోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా సాగు నీటి సమస్యే కాదు త్రాగు నీటి సమస్య కూడా పరిష్కరించ వచ్చును. కొన్ని మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది.
మా వాగ్దానం :
i. పెద్ద కడుబూరు మండలం కంబలదిన్నె, జాలావాడి, చిన్నకడుబూరు, కంబాదహల్, గవిగట్టు, పీకలబెట్ట, బాపులదొడ్డి, బసర దొడ్డి తారాపురం, రంగాపురం గ్రామాలలో ఉన్న గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
ii. హాలహర్వి మండలంలోని కొక్కర చెడు , కామినిహాల్ , శ్రీధర్ హాల్ , చాగి బండ , చెవిన హల్ , ఎం.కె. పల్లి , మాచనూరు గ్రామాల్లోని తీవ్రమైన తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
iii. కోసిగి మండలములో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారము కొరకు తగిన చర్యలు తీసుకుంటాం. కోసిగి గ్రామములో సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మించేందుకు కృషి చేస్తాం.
iv. పెద్ద కోడుమూరు మండలం జలధార పథకం పూర్తి చేసి త్రాగు నీరు అందించేందుకు కృషి చేస్తాం.
v. ఎమ్మిగనూరు పట్టణము సమ్మర్ స్టోరేజి ట్యాంకు మరియు అండర్ డ్రయినేజి నిర్మాణం కొరకు కృషి చేస్తాం.
vi. నందవరం మండలములోని తాగునీటి సమస్య పరిష్కారము కొరకు తుంగభద్ర నుండి నందవరం కామిరెడ్డి కుంట నింపేందుకు కృషి చేస్తాం. నందవరం మండలం ఫ్లోరైడ్ సమస్య పరిష్కారము కొరకు కుంట దగ్గర నిర్మించిన ఫిల్టర్ బెడ్స్ ఆధునీకరిస్తాం.
vii. ఆదోని పట్టణం కొరకు బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకుకు మరియు రామ్ జల చెరువుకు LLC నుంచి నీటిని అందించేందుకు కృషి చేస్తాం.
viii. పత్తికొండ త్రాగు నీటి సమస్య : గాజులదిన్నె నుంచి బండగట్టు, క్రిష్ణగిరి తాగునీటి పథకాల పరిధిలోని వందకు పైగా గ్రామాల ప్రజలు ఎద్కోంటున్న నీటి సమస్య పరిష్కారము కొరకు హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించేందుకు కృషి చేస్తాం. హంద్రీనీవా ప్రధాన కాల్వ 102 కి.మీ వద్ద ఒక స్లూయిస్ ఎర్పాటు చేసి, అక్కడి నుంచి కనకదిన్నె గ్రామం మీదుగా గాజులదిన్నెకు నీటిని మళ్లిస్తే ఎమ్మిగనూరు, డోన్ మరియు పత్తికొండ నియోజకవర్గాలలో తాగునీటి సమస్యను కొంతవరకైనా పరిష్కరించవచ్చు. పత్తికొండ ప్రాంతంలో కొన్ని గ్రామాలలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. మద్దికెర మండలం బురుజులు, బసినేపల్లి, జోడినేనిపేటలలో ఉన్న తీవ్రమైన త్రాగు నీటి సమస్యను పరిష్కరిస్తాం. క్రిష్ణగిరి మండలములోని ఎరుకల చెరువు గ్రామ త్రాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
ix. కోడుమూరు త్రాగు నీటి సమస్య : HNSS నుండి సల్కాపురం చంద్రాయణ తిప్పా రిజర్వాయర్ కు నీరిచ్చి అక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా కోడుమూరుకు నీరు తెచ్చేందుకు కృషి చేస్తాం మరియు గాజులదీన్నే నుండి కోడుమూరుకు పైప్ లైన్ల ద్వారా నీరు తెచ్చేందుకు కృషి చేస్తాం. ప్యాలకుర్తి , కొత్తూరు , చిల్లబండ, పులకుర్తి గ్రామాల త్రాగునీరు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
x. కర్నూలు నగర త్రాగు నీటి అవసరాల కోసం రెండవ సమ్మర్ స్టోరేజి ట్యాంకును నిర్మించేందుకు కృషి చేస్తాం.

14. రోడ్లు, రైలు మార్గాలు మరియు పారిశుధ్యం : జిల్లాలో చాలా గ్రామాలలో సిమెంట్ రోడ్లు లేక గుంతలు పడ్డాయి. వేసిన రోడ్లు నాణ్యత లేక వర్షాలకే పాడై పోతున్నాయి. అదనపు ప్రతిపాదన ఉన్నా రైల్వే మార్గాల నిర్మాణం చేపట్టడం లేదు. అదనపు రైళ్లు వేయడం లేదు. సింగల్ లైన్ ఉండటం వలన క్రాసింగ్ దగ్గర సమయం వృధా అవుతుంది రెండవ రైల్వే లైన్ వేయడం, విద్యుదీకరణ చేయడమే దీనికి పరిష్కార మార్గం.
మా వాగ్దానం :
i. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గములో కొత్త రైల్వే లైన్లు, రైల్వే లైన్ల విద్యుదీకరణ, డబుల్ లైన్ల నిర్మాణము మరియు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కొరకు కృషి చేస్తాం.
ii. హొళగుంద - మార్లమడి - గ్రామాల మధ్య మంచి రోడ్డు వేయించుటకు కృషి చేస్తాము. గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణము కొరకు కృషి చేస్తాము.
iii. హాలహర్వి మండలం అర్ధగేరి మాచనూరు, ఛాగిబండ , శ్రీధరహాల్ లకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాము.
iv. చిప్పగిరి మండలంలోని నంచర్ల - దౌలతాపురం రోడ్డు మరియు ఏరూరు దెగులహల్ రోడ్డు మరమత్తులు చేస్తాం. కోసిగి - ఉరుకుండా రోడ్డు ను డబల్ రోడ్డుగా పునర్నిర్మించేందుకు కృషి చేస్తాం. నందవరం మండలం మిట్ట సోమాపురం, గురజాల, రాయచోటి, గంగవరం, చిన్నకోతిలి, పెద్దకొత్తిలి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం.
v. ఆదోని పట్టణం సీసీ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య పరిష్కారము కొరకు తగిన కృషి చేస్తాం. ఆదోని పట్టణములో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తాం.
vi. కర్నూలు దేవనకొండ రహాదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.
vii. తుగ్గలి లో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం. తుగ్గలి నుంచి RS పేండేకల్, ఎద్దులదొడ్డి, కోతికొండ గ్రామాలకు రోడ్డు సౌకర్యము కల్పిస్తాం. లింగినేనిదొడ్డి, రాతన, కొత్తూరు, PC తండా లంకాయపల్లె గ్రామాలకు రహదారులు నిర్మిస్తాం.
viii. పత్తికొండ నియోజక వర్గం లో RTC బస్సు డిపో ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం.
ix. మద్దికెర డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం. బసినే పల్లి నుండి మనంతపురం వరకు మరియు మద్దికెర నుండి బొదినేని పేట వరకు రోడ్ల నిర్మాణం చేపడతాం. మద్దికెర లోని సాయి నగర్, రామ్ నగర్ ఎరియాలలో సి.సి రోడ్లు వేయిస్తాం.
x. వెల్దుర్తి మండలం లోని శ్రీ రంగాపురం రోడ్డు నిర్మిస్తాం. చిన్నకొలుముల పల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాం. గుంటుపల్లి కి బీటి రోడ్ వేయిస్తాం.
xi. క్రిష్ణగిరి మండలములోని తీవ్రమైన రోడ్డు రవాణా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
xii. కోడుమూరు రోడ్లవ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తాం. డోన్ నుండి హైదరాబాద్ కు వయ కోడుమూరు రోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తాం. కోడుమూరు పాత బస్టాండ్ లో ప్రయాణికులకు బస్సు షెల్టర్ నిర్మిస్తాం. కోడుమూరు కొత్త బస్టాండులో ప్లాట్ ఫామ్ , టాయిలెట్ మరియు తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
xiii. సి బెళగల్ మండలం రోడ్లు : బ్రాహ్మణదొడ్డి -జోలకల్ కు రహదారి నిర్మించేందుకు కృషి చేస్తాం.
xiv. జోహారాపురం గ్రామ శివార్లలోని డంప్ యార్డ్ స్టానంలో స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తాం.
xv. కర్నూలు నగరములో ఆర్టీసీ ఆధ్వర్యంలో సిటి బస్సులను ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తాం. కర్నూలు నుండి
xvi. విజయవాడ వరకు ఎక్ష్ప్రెస్స్ రైళ్లు ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తాం.
xvii. కర్నూల్ నుండి బళ్లారి వరకు నేషనల్ హైవేగా మర్చి నాలుగు లైన్ల రోడ్డును నిర్మించేందుకు కృషి చేస్తాం.
xviii. డోన్ నుండి గుంటూరు వరకు రైల్వే లైన్లను డబ్ల్లింగ్ మరియు విద్యుదీకరణ కొరకు కృషి చేస్తాం.
xix. మంత్రాలయం నుండి శ్రీశైలం వరకు రైలు మార్గం నిర్మాణం కొరకు కృషి చేస్తాం.
xx. కర్నూలులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు పాటుపడతాంప్రతిజ్ఞ :
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పని చేయాలి. జగనన్న అద్భుతమైన నవరత్న పథకాలు ప్రకటించారు. రైతులు, చేనేతలు, మహిళలు, యువకులు, విద్యార్థుల మరియు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిబద్దతతో కృషి చేస్తాము. మన ప్రాంత ప్రధాన సమస్యలయిన సాగు నీరు, త్రాగు నీరు మరియు ఉపాధి కల్పన కొరకు మనసా వాచా కర్మణా కృషి చేస్తామని ప్రమాణము చేస్తున్నాము. గురుతర బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.ప్రార్థన :
మన కర్నూలు పార్లెమెంటు నియోజకవర్గ మరియు శాశన సభ నియోజకవర్గాల మానిఫెస్టోలో పేర్కొన్న లక్ష్యాలను సాధించుటకు, సుసంపన్నమైన కర్నూలును నిర్మించుటకు మీ ఆశీర్వాదమును కోరుతున్నాము. నిజాయితీగా నిరీక్షిస్తున్నాము. 11-4-2019 నాడు జరగబోయే ఎన్నికలలో YSR CONGRESS PARTY కి మీ అమూల్యమైన ఓటు వేసి, మమ్ములను చట్ట సభలకు ఎన్నుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాము.