డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు

డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు-అత్యధిక సంఖ్యలో లేజర్ మరియు లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసిన ఘనత ఆయనది. ప్రజలమనిషిగా , ఉత్తమ వైద్యులుగా పేరు గడించారు.

• 1990-1992 మధ్య కాలము :కర్నూలు నగరము నరసింగరావుపేటలో “బెంగుళూరు హాస్పిటల్” అను సర్జికల్ క్లినిక్ స్థాపించి, వేల సంఖ్యలో శస్త్ర చికిత్సలు నిర్వహించారు. “2000 వేల రూపాయలకే ఆపరేషన్లు” అన్న నినాదంతో వేల మంది పేదల గుండెలలో “పేదల డాక్టరు” గా నిలిచిపోయారు.

ఉచిత వైద్య శిబిరములు–ఉచిత శస్త్రచికిత్సలు :

"ఆరోగ్యమే మహాభాగ్యము"అన్న సూత్రాన్ని గుర్తించిన డాక్టరుగారు 2008 నుండి 2016 వరకు ఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపీణీ చేశారు.

2016 లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున మెడికల్ క్యాంపులు :

ఆనంద జ్యోతి సేవా ట్రస్ట్మరియు బుట్టా ఫౌండేషన్వారిఆధ్వర్యములో ఒకే రోజు 7 ఉచిత మెడికల్ క్యాంపులద్వారా7520మందికి ఉచిత వైద్యం అందించారు. వలసలకు పేరొందిన కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ మరియు పత్తికొండ గ్రామాలలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

“ఆనంద జ్యోతి 100 ఉచిత క్యాంపులు 500 ఉచిత ఆపరేషన్లు” :

2018 లో ఈ పథకం ప్రారంభించారు.ఇంతవరకు 62 ఉచిత సర్జరీ క్యాంపులు నిర్వహించి,375 ఉచిత ఆపరేషన్లు చేసారు. ప్రజల గుండెల్లో నిలిచారు. ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు కూడా ఈపథకము ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసారు. ఈ పథకాన్ని నిర్వామంగా కొనసాగించాలన్న ధృఢసంకల్పంతో ఉన్నారు.