డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు

మీ పేరులోనే ఆదర్శం, సేవా గుణం సమ్మిళతములై ప్రకాశిస్తున్నవి.అందుకే జీవంపొసే"సంజీవ కుమార్"గా,ప్రముఖ వైద్యులుగా కీర్తి గడించారు. దాదాపు 27 సంవత్సరాలు మీ శ్రీమతి వసుంధరతో కలిసి కుటుంబ భారాన్ని మోశారు. సామాన్యుల కష్టాలు గుర్తెరిగిన కుటుంబం మీది.అందుకే పరంపరగా వచ్చిన పొలాన్ని నిలువ నీడ లేక నిరాశ్రయులైన వారికి ధారాదత్తం చేశారు మీ పెద్దలు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల ఇళ్లలో దీపం వెలిగించారు. ఓర్పు,సహనంలో భూదేవితో సమానంగా మన సమాజంలో విలసిల్లుతున్న మన కర్నూలు ఆడపడచుల కోసం వెలిశారు! వారి జీవితాల్లో ఆనంద జ్యోతి ట్రస్ట్ ద్వారా ఆనందాన్ని నింపారు . శ్రీమతి డాక్టర్ వసుంధరగారు స్త్రీవ్యాధి నిపుణురాలిగా పేదమహిళలకు ఉచితంగా వైద్యంచేస్తూ మహిళలకు విశేష సేవ చేస్తున్నారు.

భాయి భాయి అన్న నినాదాముతో అన్ని కులాలను, మతాలను, వర్గాలను ఏకం చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఎందరో కళాకారులను, సామాజిక కార్యకర్తలను, యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు చేయూత నిస్తున్నారు. మిమ్ములను ప్రోత్సహించడం, ముందుకు నడిపించడం మా బాధ్యత, కనీస కర్తవ్యం..

“సమాజమే దేవాలయం…. ప్రజలే దేవుళ్ళ” అని పెద్దలన్నారు. సమాజములోని తమ్ముళ్లుకు జరిగిన అన్యాయాన్ని అరికట్టడం కోసం... దగా పడ్డచెల్లెళ్లకు చేయూతనివ్వడం కోసం....అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ....దేశానికివెన్నెముకఅయిన రైతన్నను ఆదుకోవడంకోసం..విద్య వైద్యం అందరి హక్కు అని నిరూపించుట కోసం ...నిద్రాణమైయున్న సమాజాన్ని మేల్కొల్పడం కోసం పేదింటి ఆడపడుచులను మరింత ముందుకు నడిపించడం కోసం .... మీలాంటి వారు రాజకీయాలలోకి రావాలి. చట్ట సభల్లో గళం వినిపించాలి. సామాన్య ప్రజల అభివృద్ధి కోసం తపించే మీ లాంటి వారు ప్రజా క్షేత్రములో ఉండాలని యువకులు, మహిళలు,రైతన్నలు,బడుగు బలహీన వర్గాల వారంతా జేజేలు పలుకుతున్నారు. రాజకీయ నాయకునిగా మాకు అండగా నిల్చోమని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది ఈ సమాజం.