డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు

కర్నూలు మెడికల్ కళాశాలలోనే MBBS ,MS (జనరల్ సర్జరీ లో) ప్రతిభావంతుడిగా, బంగారు పతకాలు గెలుచుకున్నారు.

ప్రతిభాశాలి యైన విద్యార్థి :

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు సంజీవ్ కుమార్ తొలి నుంచి చదువులలో ప్రతి తరగతిలో ప్రథములుగా నిలుస్తూ, ఉన్నత శిఖరాలు అధిరోహించారు.

• 1971-1982 మధ్య కాలంలో కర్నూలు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివారు. అక్కడ 1 నుండి 9 వ తరగతి వరకు 1ST Rank మరియు 10 వ తరగతి లో 2ND Rank సాధించారు. విద్యార్థి దశలోనే ఆయన నాయకత్వ లక్షణాలు కనబడ్డాయి. పదవ తరగతిలో స్కూల్ ప్యూపిల్ లీడర్ గా ఎన్నికై అందరి ప్రశంశలను పొందారు.

• 1982-84లో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. చదువులలో ఉత్తమ శ్రేణి ఫలితాలు సాధిస్తూనే విద్యార్థి సంఘ ఎన్నికలలో చురుకుగా పాల్గొనే వారు. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో తన మిత్రుల విజయములో ముఖ్యమైన పాత్ర పోషించి కింగ్ మేకర్ అయ్యారు.

• 1984-1990 లో MBBS చదివారు. మొదటి ప్రయత్నంలోనే కర్నూలు మెడికల్ కాలేజీ నందు MBBS సీటు సాధించారు. అక్కడ కూడా డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. MBBS ఫైనల్ పరీక్షలలో గైనెకాలజి విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో 1st Rank తో బంగారు పతకం సాధించారు. జనరల్ సర్జరీ విభాగంలో 2ND RANK తో అగ్రభాగాన నిలిచారు. ‘బ్రతుకు బ్రతకనివ్వు’ అన్న సామాజిక స్పృహ వారి ప్రతి చర్యలో కనబడుతూ ఉండేది. ఇక్కడ కూడా విద్యార్థి సంఘ ఎన్నికలలో ముఖ్యమైన భూమిక పోషించారు.

• 1992-1995 మధ్య కాలములో కర్నూలు మెడికల్ కాలేజీలో MS జనరల్ సర్జరీ చదివారు. MS ప్రవేశ పరీక్షలో విశ్వవిద్యాలయ స్థాయిలో 5TH Rank సాధించారు. యూనివర్సిటీ 1ST Rank తో MS పూర్తి చేశారు.

• 1998-2000 : MCh యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి 2nd Rank సాధించి, హైద్రాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నందు చదివారు. MCh Final పరీక్షలందు డిస్టింక్షన్ తో ఉత్తీర్ణులయ్యారు.

• "ప్రతిభ" మరియు “అణకువ” ఉంటే దేనైనా సాధించ వచ్చని మన డాక్టర్ గారు విద్యార్థి దశ నుండే నిరూపించి ఎందరో భావి విద్యార్థులకు మార్గ దర్శకులైనారు. వైద్య సేవలో నిష్ణాతుడు : అత్యధిక సంఖ్యలో లేజర్ మరియు లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసిన ఘనత ఆయనది. ప్రజల మనిషిగా, ఉత్తమ వైద్యులుగా పేరు గడించారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు:

• మనిషిలో దాగిన శక్తిని వెలికి తీయటకు గల ఏకైక మార్గం ప్రోత్సాహకాలివ్వడం. ప్రతిసంవత్సరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు.

• 2016 MBBS ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 1ST RANK సాధించిన మాచాని హేమలత గారికి, మిత్రులతో కలిసి, పౌర సన్మానం చేశారు. రాజకీయ ఉద్దండులు, మేధావులు మరియు వేలాది మంది జొహరాపురం ప్రజలు ఆమెను దీవించారు. గ్రామీణ నిరుపేద కుటుంబము నుండి వచ్చిన ఆణిముత్యాన్ని గౌరవించి బడుగు బలహీన వర్గాలలో మనోధైర్యాన్ని నింపారు.