డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ గారు

"మానవ సేవయే మాధవ సేవ " అన్న భావం వారి రుధిరంలోనే ఉన్నది. అమ్మానాన్నల నుండి ఆయనకు వారసత్వముగావచ్చింది. సమస్త దానాలలోకెల్లా గొప్ప దానం భూదానం. దాని ప్రాముఖ్యతను గుర్తించిశ్రీశ్రీరంగం గారు తన సోదరులతో కలిసి పత్తికొండ గ్రామములోని పెద్దల ఆస్తి అయిన 7 ఎకరాల భూమిని 145 కుటుంబాలకు ఉచితంగా ఇచ్చారు.అదేనేడు “అంజనేయ నగర్”గారూపుదిద్దుకొనిపత్తికొండ పాత పేటలో ఉన్నది. సమాజములో వెనుకబడిన వర్గాల వారినిఆదరించడములో తాము ముందుంటామనినిరూపించుకున్న కుటుంబం డాక్టర్ గారిది. "ఆపత్కర పరిస్థితులలో మానవత్వం" కర్నూలు వరదల సమయములో వందల మందికి ఆయుష్మాన్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించి భోజన వసతి సమకూర్చారు. ఉచిత వైద్య సేవలు అందించారు. "ఆపద సమయాలలో వెన్ను తట్టి నిలిచి ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు" అని నిరూపించారు.